అంభేత్కర్ ఆశయ సాధనకు క్రుషి..


Ens Balu
1
Visakhapatnam
2020-12-06 12:24:22

భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంభేత్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ క్రుషిచేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ఆదివారం డా.బిఆర్ అంబేత్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేత్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అనగారిన వర్గాల అభ్యున్నతికి క్రుషి చేసిన మహా మనిషి అంభేత్కర్ అని కొనియాడారు. ఆయన రచించిన భారత రాజ్యంగం వలనే మనకు ఎన్నో హక్కులు సంక్రమించాయని చెప్పారు. ఆయన స్పూర్తితోనే దళిత సామాజిక వర్గం అభివ్రుద్ధికి కూడా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రుషి చేస్తూనే ఉంటుందని అన్నారు. తరువాత ఎల్ఐసీ భవనం దగ్గర అంబేత్కర విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివరామక్రిష్ణ, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు  రెయ్య వెంకట రమణ, నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, చెట్టిపాల్గున, శాసనమండలి సభ్యులు  సురేష్, సమన్వయ కర్త లు మళ్ల విజయ ప్రసాద్, కే.కే రాజు, రాష్ట్ర  కార్పొరేషన్ చైర్మన్లు  కోలా గురువులు, మధుసూదన రావు, పి సుజాత,మాజీ శాసనసభ్యులు కుంభ రావి బాబు,ఎస్ ఎ రెహ్మాన్, పార్టీ అదనపు కార్యదర్శి  రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.