డా.బీఆర్ అంభేద్కర్ కు డీవైఎఫ్ఐ నివాళి..


Ens Balu
4
వైజాగ్ జైల్ రోడ్డు
2020-12-06 13:03:57

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువతకు ఆదర్శమని డివైఎఫ్ఐ నగర కార్యదర్శి రాజు అన్నారు. ఆదివారం డా.బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఎల్ఐసీ భవనం వద్ద వున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తుందన్నారు. బీజేపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేసిందని ఆరోపించారు. వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. దళితుల పైన దాడులు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దీనిని ప్రజలంతా ఖండించాలని కోరారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు గణేష్ నాయకులు సాయి తేజ, వేణు, భానుప్రకాష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.