కోవిడ్ నివారణకు చిత్తశుద్ధితో కృషి .. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
Ens Balu
3
Visakhapatnam
2020-08-03 16:56:28
రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాధి నివారణకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నాడు ఆయన నగరం లోని స్టేట్ కోవిడ్ ఆసుపత్రి విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సందర్శించి డాక్టర్ల తో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాధి నివారణకు రూ. వేయి కోట్లు ఖర్చు చేయడానికి సిధ్ధం గా ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత ఉందని, అందుకే పెద్ద ఎత్తున నియామకాలు చేస్తున్నామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ మనోస్థైర్యం దెబ్బతినకుండా అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు. కొన్ని సందర్భాల్లో రోగుల ఆరోగ్య పరిస్థితి పై సమాచారం తెలియడంలేదని వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారని, దీన్ని నివారించడానికి రోగి వివరాలతో బాటు, వారి బంధువుల ఫోన్ నెంబర్ లను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్య వరప్రసాద్, డిఎంహెచ్ఓ తిరుపతి రావు , ఇతర అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.