అంభేత్కర్ స్పూర్తితోనే సీఎం వైఎస్ జగన్ పాలన..


Ens Balu
3
Amalapuram
2020-12-06 16:37:35

అసమానతలు లేని పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఆదివారం నవభారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 64 వ వర్ధంతిని పురస్కరించుకుని అమలాపురం మద్దాలవారి పేట లో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మేధావి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం తో ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎస్.సి.ఎస్టీ,ఇతర వర్గాలమధ్య తేడా లేకుండా అన్ని వర్గాలవారికి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ జనరంజకమైన పాలన రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. భారత దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కారణం గానే ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక్కటిగా  భారత దేశం ఎదిగిందని మంత్రి తెలియ చేసారు. స్త్రీ దాశ్య విమోచకడు బాబా సాహెబ్ మేధస్సును గుర్తించి ఈ రోజు ఆ మహా మేధావి కి దేశ ప్రధాని మొదలుకొని,రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు మొదలుకొని  ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా ఘనంగా నివాళులు అర్పించారని మంత్రి తెలిపారు.అలాగే అమలాపురం గడియార స్తంభం సెంటర్ లోను,మరియు ఈదరపల్లి ఒంతెన వద్ద కూడా మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ శాసన సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి,పట్టణ నాయకులు మట్ట పర్తి నాగేంద్ర, వాసంసెట్టి సత్యం, వాసంసెట్టి సుభాష్, చెల్లు బోయిన శ్రీనివాస్,ఒంటెద్దు వెంకన్నా యుడు, షేక్ అబ్దుల్ ఖాదర్,సంసాని బులినాని,తోట శ్రీను,అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బొక్కా ఆదినారాయణ,వైస్  చైర్మన్ బాబి, తిరుకోటి సతీష్ కుమార్, ఉండ్రు వెంకటేష్, మెండు రమేష్, కొల్లాటి దుర్గాబాయి,కర్రి రాఘవులు ,నాగారపు వెంకటేశ్వరరావు, పొలమూరి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.