రాజ్యాధికారం కోసం తుదివరకూ పోరుబాట..


Ens Balu
1
పబ్లిక్ లైబ్రెరీ
2020-12-06 16:46:07

రాజ్యాధికారం సాధించేవరకు నిరంతర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజకీయ చైతన్య వేదిక ఆవిర్భావ సభలో వక్తలుక్తులు అభిప్రాయపడ్డారు. ఆదివారం పబ్లిక్ లైబ్రరీ లో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ వాది, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేవలం మనువాద పార్టీలే రాజకీయ అధికారాన్ని చలా ఇస్తున్నారన్నారు. బహుజన వాదులందర్ని ఒక వేదిక పైకి తీసుకు వచ్చేందుకు ఈ చైతన్య వేదిక ఏర్పాటు చేశామన్నారు. మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెబ్సైట్ జైరాజ్ మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణ వాదం, బహుజనవాదం మాత్రమే ఉన్నాయన్నారు. మోసపూరితంగా బహుజనులను మభ్యపెట్టి బ్రాహ్మణ వాదులు అధికారాన్ని చలాఇస్తున్నారన్నారు. పెట్టుబడిదారీ వర్గం , బ్రాహ్మణ వాదంతో రాజ్యాధికారం పొందుతున్నారు అన్నారు. దళిత హక్కుల  పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జె వి ప్రభాకర్ రావు మాట్లాడుతూ బహుజనులు రాజ్యాధికారం దిశగా నిరంతరం పోరాటం చేయాలని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు బహుజనలంతా కృషి చేయాలని కోరారు .రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాధికారం కోసం ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం కూడా ఉందన్నారు .ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలు 50 శాతం పైగా ఉన్నా అధికారం చేజిక్కించుకోలేకపోవడంలో ఐక్యత లేకపోవడమే కారణమని అన్నారు. రాజకీయ ప్రణాళిక అవసరమన్నారు. రాజకీయ చైతన్యం కోసం ఈ వేదికను ఏర్పాటు చేశామన్నారు. రైతు నాకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన మూడు చట్టాలను రద్దు చేసే వరకు వారు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని, 8 వ తేదీన తలపెట్టిన బందుకు   పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈ సందర్భంగా తీర్మానాన్ని ఆమోదించారు. అదేవిధంగా కరెంటు బిల్లు రద్దు చేయాలని, కాలుష్యం పై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరారు. న్యాయవాది గిరిజన మాట్లాడుతూ దేశంలోని మనువాద పార్టీలు బహుజనులను మింగేస్తున్నారన్నారు. బడుగు వర్గాలను అణగదొక్కడానికి కుట్ర జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్జున్,   ప్రొఫెసర్ ప్రజ్ఞ, టీ గురుమూర్తి,ఐఎం మహ్మద్, గిరిధర్, ప్రసాద్ రావు, పి మల్లేష్, ప్రకాష్ రావు,మాటూరి శ్రీనివాస్, లూధర్ బాబు,డాౠకెఎల్.రావు తదితరులు పాల్గొన్నారు