కోవిడ్-19 సేవలకు రిటైర్డ్ డాక్టర్ బి.గోవిందరాజులు...


Ens Balu
3
Visakhapatnam
2020-08-03 17:00:50

విశాఖపట్నం జిల్లాలో కరోనా బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతున్న నేపద్యంలో జిల్లా యంత్రాంగానికి అండగా ఉండి కోవిడ్ రోగులకు సేవలు అందించేందుకు విశ్రాంత వైద్యులు ముందుకు వస్తున్నారు. రేడియాలజిస్ట్ అయిన రిటైర్డ్ వైద్యులు డాక్టర్ బి.గోవిందరాజులు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ను కలిసి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయనను అభినందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.మ్.ఏ) కోఆర్డినేటర్ అయిన డాక్టర్ గోవిందరాజులు జిల్లా యంత్రాంగానికి సమన్వయ కర్తగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో జిల్లా యంత్రాంగానికి సహాయం గా ఉండి కరోనా బాధితులకు సేవలు అందించేందుకు డాక్టర్ల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తన ప్రేరణతో మరింత మంది విశ్రాంత వైద్యులు కోవిడ్ సేవలకు వస్తారని ఆయన అభిలషించారు. ఆయన వెంట ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ కె.ఫణి కుమార్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ కలెక్టర్ ను కలిశారు. జారీ ఉపసంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ విశాఖపట్నం