డా.బీఆర్ అంభేద్కర్ మహా దార్శినీకుడు..


Ens Balu
1
Visakhapatnam
2020-12-06 17:52:37

వందేళ్ల ముందు చూపుతో రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టిన  డా.బీఆర్ అంభేద్కర్ దేశం గర్వించదగ్గ మేధావి అని ఆంధ్రా యూనివర్సిటీ సైకాలజీ విభాగం అధిపతి ఆచార్య ఎమ్ విఆర్ రాజు పేర్కొన్నారు. అంభేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా డిహెచ్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖలోని జైలురోడ్డులో వున్న విగ్రహానికి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని పట్టి పిడించిన అస్పృశ్యత నుంచి దళితులకు విముక్తి కలిగించిన మహనీయుడని కొనియాడారు. అందరికీ వయోజన ఓటు హక్కు కలిగించి చాయ వాలాను ప్రధానిని చేసిన మహా జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమేనన్నారు.  సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, అంభేత్కర్ రజ్యాంగం ద్వారా బడుగులకు కల్పించిన ఆత్మగౌరవాన్ని మోడీ కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం  టిడ్ కో ఇళ్లకు మంచినీరు విద్యుత్ సరఫరా, మురుగు నీటి పారుదల కల్పించాలన్నారు.  ఇళ్ల స్థలాలు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని  డిమాండు చేశారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్ బూసి వెంకట రావు, జి రామ్ బాబు, మండే సత్యనారాయణ, సైంటిస్ట్ చంద్ర శేఖర్, బూ సి పరమేశ్వరి ,ఈ తల పాక సుజాత, బత్తుల శ్రీనివాస రావు, పుండి మల్లేశ్వర రావు, మరుపిల్లి పైడి రాజు , సోడా దాసి సుధాకర్,  రాజాన అప్పా రావు, బంటు కృష్ణా రావు ,  ఏళ్లపు రాంబాబు, జి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.