డా.బీఆర్.అంభేద్కర్ యువతకు మార్గదర్శి


Ens Balu
4
జెఎన్టీయూకె
2020-12-06 20:21:01

కుల మతాలకతీతంగా దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేసి మానవతా విలువలను కాపాడిన రోజే డాక్టర్ బీఆర్ అంభేద్కర్ కి నిజమైన నివాళి అర్పించినట్టు అని ‌జెఎన్‌టియుకె ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు అన్నారు. ఆదివారం అంభేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణానికి డా.బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌చేసిన కృషి కొనియాడదగినదని గుర్తు చేశారు. అందరూ  మహనీయుల ఆశయాలను ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. లైబ్రరీ & ఈ-లెర్నింగ్‌ ‌రీసోర్సెస్‌ ‌డైరెక్టర్‌ ‌మరియు ఎస్సీ, ఎస్టీ సెల్‌ ‌లైజన్‌ ఆఫీసర్‌ ‌ప్రొ.పి.సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ‌ప్రొ.సిహెచ్‌.‌సత్యనారాయణ, ఓఎస్‌డి ప్రొ.వి.రవీంద్రనాధ్‌, ‌డిఏపి ప్రొ.ఆర్‌.శ్రీ‌నివాసరావు, స్కూల్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌స్టడీస్‌ (ఎస్‌ఎంఎస్‌) ‌డైరెక్టర్‌ ‌ప్రొ.ఏ.కృష్ణమోహన్‌, ఉమెన్‌ ఎం‌పవర్‌మెంట్‌ & ‌గ్రీవెన్సెస్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రొ.ఏ.స్వర్ణకుమారి, ఐక్యూఏసి డైరెక్టర్‌ ‌ప్రొ.ఎన్‌.‌బాలాజీ, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రొ.వి.శ్రీనివాసులు, ఇంక్యుబేషన్‌ ‌సెంటర్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రొ.జెవిఆర్‌.‌మూర్తి, యుసిఇకె ప్రిన్సిపాల్‌ ‌ప్రొ.బి.బాలకృష్ణ, డా.బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌సెంట్రల్‌ ‌లైబ్రరీ లైబ్రేరియన్‌ ‌డా.బి.ఆర్‌.‌దొరస్వామినాయక్‌, ‌టీచింగ్‌ & ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.