వ్యర్ధాలపై వ్యతిరేకపోరాటం ఉద్యమంలా చేయాలి..


Ens Balu
3
Visakhapatnam
2020-12-07 17:00:40

వ్యర్థాలపై వ్యతిరేఖ పోరాటంను విజయవంతానికి అందరూ శ్రద్థతీసుకోవాలని అరకు పార్లమెంటు సభ్యురాలు జి. మాధవి పేర్కొన్నారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యర్థాలపై వ్యతిరేఖ పోరాటం కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంపై యువతను ఉత్తేజ పరచాలని, మన ప్రాంతంను మనమే శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ప్రతీ కుటుంబ సభ్యులందరూ మరుగుదొడ్డిని ఉపయోగించుకొనేలా చూడాలన్నారు.  స్నానానికి ఉపయోగించే నీరు, పాత్రలు శుభ్రపరచడం, బట్టలు ఉతకడర వంటి వ్యర్థ జలాలను మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా లేదా ఇంకుడు గుంతలకు మళ్ళించడం ద్వారా మురుగునీరు రొడ్లపై ప్రవహించకుండా అందరూ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.  పర్యాటక ప్రాంతాల్లో చెత్త ఉండకుండా అందరూ తగు జాగ్రత్తలు వహించాలని చెప్పారు.  అందరమూ ఒక బాధ్యతగా తీసుకొని వ్యర్థాలపై వ్యతిరేఖ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.  ఇందుకు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.  పాయకరావుపేట శాసన సభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్నవారంతా వ్యక్తిగత పారిశుధ్యం గురించి తెలుసుకొని ఉండాలని కనీసం వారు  ఆహారం తినే ముందు, మలవిసర్జన తరువాత సబ్బుతో చేతలు కడుగుకోవాలని చెప్పారు.  ప్రతి గ్రామంలోను వ్యర్థాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.  మన గ్రామాలను మనం శుభ్రం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు.  పాడేరు శాసన సభ్యులు జి. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వ్యర్థాలపై పోరాటానికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారం పరిశుభ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  ప్రతీ ఒక్కరూ తమ తమ గ్రామాలను పరిశుభ్రం చేసుకునేందుకు సహకరించాలన్నారు.  అరకు శాసన సభ్యులు శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ  గ్రామాలను శుభ్రం చేసుకోవడానికి అందరమూ నడుం బిగించాలన్నారు.  జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జున సాగర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వ్యర్థంపై పోరాటంను పటిష్టంగా అమలు చేయాలన్నారు. అంతకు ముందు జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఇ. రవి కుమార్, డిపిఓ కృష్ణవేణి, సెట్విస్ సిఇఓ శ్రీనివాసరావు, ఎస్.సి., బి.సి. కార్పొరేషన్ ఇ.డి.లు శోభారాణి, పెంటోజిరావు, ఎంపిడిఓలు, ఇఓఆర్.డి.లు, తదితరులు పాల్గొన్నారు.     అనంతరం డిఎల్.పి.ఓ.లు, ఎంపిడిఓలు, ఇఓఆర్.డి.లు, తదితర అధికారులతో వ్యర్థాలపై వ్యతిరేఖ పోరాటంను విజయవంతానికి అందరూ కృషిచేయాలని జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. నాగార్జున సాగర్ పిలుపునిచ్చారు.  కార్యక్రమాలను నిర్వహించినపుడు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులను పిలవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలపై తీసుకోనున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.  ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఇ. రవి కుమార్, డిపిఓ కృష్ణవేణి, సెట్విస్ సిఇఓ శ్రీనివాసరావు, ఎంపిడిఓలు, ఇఓఆర్.డి.లు, తదితరులు పాల్గొన్నారు.