శ్రీకాకుళంలో స్పందనకి 58 వినతులు..


Ens Balu
2
Srikakulam
2020-12-07 17:29:18

శ్రీకాకుళంజిల్లాలో స్పందన కార్యక్రమానికి 58 వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులు అందాయి. ఫోన్  స్పందన, ఎలక్ట్రానిక్ స్పందన ద్వారా ప్రజలు వివిధ రకాల అర్జీలు తెలియజేసారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు బదలాయించి వాటికి వారంరోజుల్లో పరిష్కారం చూపించాల్సింది ఆదేశించినట్టు డిఆర్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్  నుండి చలమయ్య, స్పందన విభాగం  సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, హెచ్.సెక్షన్ డి.టి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.