విశాఖలో 3కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం..


Ens Balu
2
Visakhapatnam
2020-12-07 17:30:29

ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అందరూ మొక్కలు నాటుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  సోమవారం పనోరామ హిల్స్ వద్ద మొక్కలు నాటు కార్యక్రమంలో రాష్ల్ర పర్యాటక శాఖ మంత్రి, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటుటకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 3 కోట్లు మొక్కలు నాటుటకు లక్ష్యమన్నారు.  మొక్కలు నాటడం వలన వాతావరణ కాలుష్యం నివారణ, ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటాలన్నారు.  రాష్ట్రంలో విశాఖపట్నం సిటీ అంతా మొక్కలు నాటి కాలుష్యనివారణకు అందరూ సహకరించాలని చెప్పారు.  విమానాశ్రయంనకు వెళ్లే మార్గంలోనూ మొక్కలు నాటాలన్నారు.  ప్రతి ఒకరూ మొక్కలు నాటాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జివియంసి కమీషనర్ జి. సృజన, విఎంఆర్డిఎ కమీషనర్ కోటీశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ వి. వేణుగోపాల్ రెడ్డి, డిఎఫ్ఓలు డి. లక్ష్మణ్, శాంతిస్వరూప్, తదితరులు పాల్గొన్నారు.