త్వరలోనే యన్ఐడియం కార్యకలాపాలు..


Ens Balu
2
Vijayawada
2020-12-07 18:08:50

క్రిష్ణాజిల్లాలో త్వరలోనే యన్ఐడియం కార్యకలాపాలు ప్రారంభం కావాలన్న ఆశాభావాన్ని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ వ్యక్తం చేసారు. స్ధానిక జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జాతీయ విపత్తుల నివారణ సంస్ధ (యన్ఐడియం) కృష్ణాజిల్లాలో ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రకృతి విపత్తుల నివారణాసంస్ధ మేనేజింగ్ డైరెక్టరుతో చర్చించి యన్ఐడియం త్వరితగతిన ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సానుకూల ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుందన్నారు. యన్ఐడియం ఏర్పాటు కోసం అభివృద్ది నిధుల చెల్లింపులు నిలుపుదల చేయాలని, ప్రభుత్వం నుండి సానుకూల ఉత్తర్వుల కోసం ప్రభుత్వానికి లేఖ వ్రాయడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నందున అధికారులు నిర్మాణపనులకు ఎ టువంటి ఆటంకం లేకుండా సహకారం అందిస్తారని కలెక్టరు తెలిపారు. విద్యుత్తు కనెక్షన్లు, నీటిసరఫరా, రహదారుల అనుసంధానంకు సంబందించి సంబంధిత శాఖల అధికారులు నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న కలెక్టరు యన్ఐడియంపై ఎ టువంటి అదనపు భారం లేకుండా శాఖాపరంగా వీలైనంత మేరకు సహకారాన్ని అందిస్తామని కలెక్టరు ఇంతియాజ్ పేర్కొన్నారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు కె. మాధవిలత, సబ్‌కలెక్టరు ప్రతిష్టామాంగైన్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, యన్ఐడియం జాయింట్ డైరెక్టరు లెఫ్టెనెంట్ కల్నల్ బి.సి. వశిష్ట, యన్ఐడియం అధికారి అశోక్, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు, విద్యుత్తు, ఆర్ డబ్ల్యుయస్, ఆర్అండ్‌బి, పంచాయతిరాజ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.