అభివ్రుద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి..
Ens Balu
3
Komarada
2020-12-07 18:13:20
విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను, సచివాలయాలను జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. మండలంలో ఆయన సుడిగాలి పర్యటన జరిపారు. విక్రమపురంలో నిర్మిస్తున్న సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. రాజ్యలక్ష్మీపురం మండలపరిషత్ ప్రాధమిక పాఠశాలలో జరుగుతున్న నాడూ-నేడు పనులను తనిఖీ చేశారు. అలాగే కంబవలస గ్రామానికి వెళ్లి, అక్కడ నిర్మితం అవుతున్న సచివాలయ భవనాన్ని, అంగన్‌వాడీ కేంద్రం భవనాన్ని పరిశీలించారు. అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం దుగ్గి గ్రామంలో నిర్మితమవుతున్న అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు. ఇదే గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంకు శాఖకు వెళ్లి, వైఎస్ఆర్ బీమా, జగనన్నతోడు కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. అర్హులందరికీ త్వరగా పథకాలను అందజేయాలని కోరారు. ఈ పర్యటనలో ఇన్‌ఛార్జి తాశీల్దార్ సూర్యనారాయణ, ఎంపిడిఓ గోపాలకృష్ణ, ఎంఇఓ నారాయణస్వామి, మండల ఇంజనీర్ జి.చంద్రమౌళి తదితర అధికారులు పాల్గొన్నారు.