ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి..
Ens Balu
2
Vizianagaram
2020-12-07 18:32:20
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించే నిమిత్తం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందని వినూత్నమైన మార్పులు తీసుకువచ్చిందని జాయింట్ కలెక్టర్ మహేష్. కుమార్ పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సోమవారం తన పర్యటనలో భాగంగా కొమరాడ మండలం విక్రంపురం, కంబవలస సచివాలయాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు, అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోటే నివాసం ఉండాలన్నరు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని సమయ పాలన పాటించాలని అన్నారు. పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టిక పరిశీలించారు, అనంతరం కంబవలస అంగన్వాడీ కేంద్రం సందర్శించి కేంద్రంలో నిర్వహిస్తున్న పనులపై ఆరా తీసి సూచనలు అందించారు.
అనంతరం రాజ్యలక్ష్మి పురం ఎం.పి.పి.స్కూల్లో నిర్వహిస్తున్న నాడు - నేడు పనులను పరిశీలించి నిర్వహిస్తున్న పనుల పై ఆరాతీశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఆత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు, నాడు నేడు పనులు వేగవంతం చేయాలన్నారు.
అనంతరం కొమరాడ APGVB బ్యాంకులో వై.ఎస్.ఆర్.భీమా, జగన్నన్న తోడు పనుల అమలుకు సంబంధించిన పనులు పరిశీలించారు.