పతాక నిధికి విరివిగా విరాళాలివ్వండి..
Ens Balu
1
కలెక్టరేట్
2020-12-07 18:58:28
మాజీ సైనికులు, అమర వీరుల కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా చేపట్టే కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ ధళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం భారత సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్.. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధిని ప్రారంభించి, విరాళం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణకు అహర్నిశలు కృషిచేసిన సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాల పరిరక్షణ అందరి బాధ్యతన్న విషయాన్ని గుర్తుంచుకొని, పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. జేసీ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) సీహెచ్ సత్తిబాబు తదితరులు కూడా విరాళాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ పి.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.