యూనివర్శిటీల కోసం మాట్లాడే అర్హత టిడిపికి లేదు..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-07 19:28:00
ఆంధ్రప్రదేశ్ లో యూనివర్శిటీల కోసం మాట్లాడే అర్హత టిడిపి నాయకులకు లేదని వైఎస్సార్సీపి విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు బి. కాంతారావు అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, టిడిపి హయాంలో యూనివర్శిటీలు వీసిలకు నోచుకోలేదన్నారు. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ యూనివర్శిటీలకు విసిలను నియమిస్తే తట్టుకోలేని టిడిపి అవ్వాకులు, చెవ్వాకులు పేలుతోందన్నారు. విద్యార్ధుల కోసం వారి భవిష్యత్తు కోసం ఆలోచించి వారి పక్షాన నడిచిన ఘనత వైఎస్సార్సీపీ పార్టీకే దక్కుతుందన్నారు. ఒక ఉన్నత విద్యావంతుడు, దళితుడు అయిన ఆదిమూలపు సురేష్ ను రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాశాఖ మంత్రిగా చేస్తే దానిని కూడా టిడిపి జీర్ణించుకోలేకపోతుందన్నారు. దళితులంటే టిడిపికి చులకనగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంత్రిగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే విద్యావిధానంలో సమూల మార్పులు ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. టిడిపి హయాంలో ప్రైవేటు విద్యాసంస్థలు అభివ్రద్ధి చెందితే తమ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ విద్యాసంస్థల కంటే దీటుగా ప్రభుత్వం నాడు నేడు కింద అభివ్రుద్ధి చేసిందన్నారు. చంద్రబాబు తన హాయంలో కీలకమైన పదవులు కమ్మసామాజిక వర్గానికి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. టిడిపి నోటికొచ్చినట్టు ఊరుకునేది లేదని హెచ్చరించారు..