ఆ కలెక్టర్ ప్రక్రుతి ప్రేమకోసమే పరితపిస్తుంటారు..
Ens Balu
3
Vizianagaram
2020-12-08 11:13:35
ఒక జిల్లాకి కలెక్టర్ అంటే చుట్టూ పదుల సంఖ్యలో అధికారులు.. చిటికేస్తే జరిగే పనులు.. బిళ్ల బంట్రోతులు..గన్ మేన్ లు.. హోదా మందీ, మార్బలం..కలెక్టరంటే ఇలా ఉంటారు అనుకుంటారు.. కానీ విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ను చూస్తే అవేమీ కనిపించవు.. ఆయనను చూస్తే కనిపించేది ఒక్క ప్రక్రుతి ప్రేమే.. అవును మీరు విన్నది నిజమే..ఆయన పనిచేసే చోట, నివాసం వుండే చోటా చుట్టూ పచ్చని ప్రక్రుతి ఉండాలి...దాని కోసం నిత్యం మొక్కలు నాటుతుంటారు...ఆ మొక్కల్లో పేరుకు పోయిన చెత్తను కూడా స్వయంగా తొలగిస్తుంటారు ..ఇంతలా పనిచేసే జిల్లా అధికారిని చూసిన అధికారులంతా కూడా ఆయన బాటలోనే పయనిస్తారు.. కలెక్టరేట్ లో ప్రతీ వారం చెత్తా చెదారాన్ని కలెక్టర్ స్వయంగా తన ఉద్యోగులతో కలసి శ్రమధానం చేస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెత్తపై యుద్దం ప్రకటించడంతో ఇక రోజూ చెత్తకర్ర పట్టుకొని చెత్తను తరిమి కొడుతున్నారు. మంగళవారం కలెక్టరేట్ లో సిబ్బందితో కలిసి ప్రాంగణంలో పేరుకుపోయిన పిచ్చితుప్పలను చెత్తను స్వయంగా తొలగించారు కలెక్టర్ హరి జవహర్ లాల్.. కలెక్టర్ మంచి కార్యక్రమానికి ముందుండటంతో అధికారులు కూడా అదే ఉత్సాహంతో పనిచేసి తమ ప్రాంతాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మనమూ-మన పరిశుభ్రత బాగుంటే ఆరోగ్యం పదిలంగా వుంటుందని నమ్మే విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పలువురు ఐఏఎస్ లకు ఆదర్శనంగా నిలుస్తున్నారు. అంతేకాదు పలు అవార్డులు పొందుతూ అందరి మన్ననలూ పొందుతున్నారు. నిజంగా ఇలాంటి కలెక్టర్ ఉన్న జిల్లాలు రాష్ట్రంలో పేరు తెచ్చుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు..!