అనంతలో డిప్యూటీ సీఎంకి ఘన స్వాగతం..
Ens Balu
4
Anantapur
2020-12-08 12:24:59
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి ఎస్.బి. అంజద్ బాషాకి అనంతపురంలో ఘనస్వాగతం లభించింది. జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన డిప్యూటీ సీఎంకి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఇతర అధికారులు స్వాగతం పలిసికారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లారు. మంత్రిని కలిసిన వారిలో ఏ. ఎస్. పి.నాగేంద్ర ,డి.ఎస్.పి వీర రాఘవ రెడ్డి ,ఆర్డిఓ గుణ భూషణ రెడ్డి,వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఇనాయతుల్లా నాలుగవ టౌన్ సిఐ శ్రీనివాసులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. మంత్రిరాక సందర్భంగా వివిధ ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధుల నుండి ఉప ముఖ్యమంత్రి వినతులను సమర్పించారు. వారిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పెట్టిన అర్జీలపై తక్షణమే వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.