బిల్లు ఉపసంహరించేంత వరకూ ఉద్యమం ఆగదు..
Ens Balu
4
Visakhapatnam
2020-12-08 15:31:26
అన్నదాతలను మోసగించే బిల్లులను రద్దుచేసేంతవరకు కాంగ్రెస్ పోరాడుతుందని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర రావు తెలిపారు. విశాఖలో మంగళవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్ కు సంఘేభావం తెలుపుతూ జగదాంబ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పరిసర ప్రాంతాల లోని దుకాణదారులు షాపులు మూసి మద్దతు తెలపాలని కాంగ్రెస్ నాయకులు అభ్యర్ధించారు.రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న మోడీ తన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని సంకు కోరారు.కేవలం అంబానీ,అదానీ వంటి కార్పొరేట్ లకు మాత్రమే ఈ బిల్లులు లబ్ది చేకూరుస్తాయని సంకు మండిపడ్డారు.రైతులు దేశానికి వెన్నుముక అని అలంటి రైతులనే దోచుకోవాలని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సంకు ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతువ్యతిరేక బిల్లులను ఉపసంహరిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని సంకు గుర్తుచేశారు.రైతులను ఆదుకోవాలని,రైతువ్యతిరేక బిల్లులను వెంటనే రద్దుచేయాలని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బంద్ లో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఏ నారాయణరావు మాట్లాడుతూ అన్నదాతల పట్ల మోడీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.ప్రపంచంలో రైతులను మోసగిస్తున్నఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేసారు.వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా కాకుండా అసెంబ్లీ లో బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చెయ్యాలని నారాయణరావు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో సంకు వెంకటేశ్వర రావు,జీ.ఏ.నారాయణ రావు లతో పాటుగా రాష్ట్ర బీసీ.సెల్ వైస్ చైర్మన్ మూల వెంకట రావు,ఇంటాక్ అధ్యక్షుడు తమ్మిన నాయుడు,రాష్ట్రయూత్ వైస్ ప్రెసిడెంట్ అంగ వర్మ,దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్ డీ సింకా,కోవిద్-19 కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్,ఇంకా నాయకులు త్రినాధరావు,నూనెల పోలరావు,శేషం శ్రీనివాసరావు,పరదేశి,శ్రీనివాసరావు,ఎం డీ అలీ,రమణ,మహేష్,మొహిద్దీన్ తదితరులు ఈ బంద్ లో పాల్గొన్నారు.