విశాఖలో భారత్ బంద్ సక్సెస్..


Ens Balu
4
Visakhapatnam
2020-12-08 15:49:36

అఖిల భారత రైతు సంఘాల కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు విశాఖనగరంలో నిర్వహించిన భారత్ బంద్ మంగళవారం విజయవంతం అయ్యింది. విశాఖపట్నంలోని వాణిజ్య సంస్థలు, షాపులు, షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, విద్యాసంస్థలు, ఆటో, మోటారు, బస్సు, పరిశ్రమలు అన్ని రకా కార్యకలాపాలను మూసివేసి రైతు భారత్‌ బంద్‌కు మద్దత్తు ఇచ్చారు. విశాఖ నగర పరిధిలో  మద్దిపాలెం, కంచరపాలెం,గోపాల పట్నం, పెందుర్తి, మధురవాడ,గాజువాక, మల్కాపురం  ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. నగరంలో పూర్ణామార్కెట్ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్ష్, మద్దిపాలెం నుంచి కాంప్లెక్ష్ వరకు వేలాది మందితో ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్బంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ, నరేంద్రమోడీ ప్రభుత్వం   పార్లమెంటులో మద్దతు లేకపోయినా  అక్రమంగా మూజువాని ఓటుతో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ చట్టాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు ఉరితాళ్ళుగా మారాయని ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని దేశంలోని అధాని, అంబాని వంటి బడా కార్పోరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేలా కాంట్రాక్టు వ్యవసాయాన్ని తీసుకొచ్చారని మండి పడ్డారు. దీనివల్ల రైతు భూములు కార్పోరేట్‌ సంస్థలకి కాంట్రాక్టు ఒప్పందం చేయాలి. కార్పోరేట్‌ సంస్థలు చెప్పిన పంటలే వేయాలి. పండిన పంటనంతా కంపెనీలకే ఇచ్చేయాలి అన్నారు. ఆఖరికి పండించిన పంట కార్పోరేట్‌ సంస్థలు తీసుకోకపోయినా, ఇస్తానన్న ధర ఇవ్వకపోయినా కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు. రైతు భూములపై రైతు హక్కు కూడా కోల్పోనున్నారని అన్నారు. సిపిఐ రాష్ట్ర  సహాయ కార్యదర్శి  జెవి సత్యన్నారాయణ మాట్లాడుతూ రైతు మార్కెట్‌ యార్స్ రద్దుచేస్తున్నారని. తప్పనిసరిగా రైతు తమ పంటను బడా కార్పోరేట్‌ సంస్థలకు అమ్మేలా మరొక చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. దీనినే రైతు దేశంలో ఎక్కడైన పంట అమ్ముకోవచ్చని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. నిత్యవసర సరుకుల చట్టం  సవరణ చేసి రైతుల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల సంఘాలు, వామ పక్షనాయకులు పాల్గొన్నారు.