తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం..


Ens Balu
4
Srikakulam
2020-12-08 18:36:04

శ్రీకాకుళం జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం, స్థానిక ఎం.పి.డి.ఓ. కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరం జరిగింది.  కార్యక్రమంలో  17 మంది ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు రక్తదానాన్ని చేసారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్షేత్ర సహాయకులను  అభినందించి, వారికి  సర్టిఫికేట్ లను అందచేసారు. అనంతరం ఎం.పి.డి.ఓ.ని సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రెడ్ క్రాస్ సంస్థ రక్తాన్ని అందించనున్నట్లు తెలిపారు.   ప్రతీ రోజు అవసరం మేరకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు 30 మంది వరకు రక్తాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు  కలెక్టర్ తెలిపారు.  కావున యుపత రక్తదానాన్ని చేసి సమాజానికి మంచి  సేవలు అందించాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ఎక్కువ మంది మహిళా క్షేత్ర సహాయకులు రక్తదానానికి ముందుకు వచ్చినందుకు వారిని అభినందించారు.

    ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, మండల అభివృధ్ధి అధికారి వి.ప్రకాశరావు, రెడ్ క్రాస్  సంస్థ చైర్మన్ డా.పి.జగన్మోహన్ రావు, డా.నిక్కు అప్పన్న, పెంకి చైతన్యకుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఎపిడిలు  రోజా రాణి, ఎల్. అలివేలు మంగమ్మ, కుందువాని పేట మాజీ సర్పంచ్ ఎస్.సూర్యం,  ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు ఎం.మల్లేశ్వర రావు, బి.రాజేశ్వరి, జి.చిన్నారావు, పి.శంకరరావు, జి. రమణమూర్తి, జి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.