స్వచ్చ సర్వేక్షణ్ ఏర్పాట్లలో భాగంగా డ్రై రీసోర్సు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మూడవ జోన్ లోగల ఎం.ఎస్.ఎఫ్. కేంద్రంలో ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేశారు. అనంతరం ఎం.ఎస్.ఎఫ్. - 3లో మెకానికల్ ఇంజినీరింగు వారు ప్రతిపాదిత కెమెరాల ఏర్పాటు, వేయింగు బ్రిడ్జి ఏర్పాట్లు మెకానికల్ విభాగం పర్యవేక్షక ఇంజినీరుతో చర్చించారు. భూ గర్భ డ్రైనేజి పనులు నిర్వహణకు గాను కొనుగోలు చేసిన, 6000 కిలోల హై ప్రెసర్ జేట్టింగు మిషిన్, హైడ్రాలిక్ ఆపెరేటర్ గ్రాబ్ బకెట్ ల పని తీరును మూడవ జోన్ పరిధిలో గల ఇందిరా గాంధి స్టేడియం వద్ద గల యు.జి.డి. హొల్స్ ను ప్రయోగాత్మకంగా నిర్వహించి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా నిబంధనల మేరకు మేన్ హోల్ ను మిషన్ హోల్ గా మార్పుచేసే నిమిత్తం జివిఎంసి స్వయంగా ఈ రెండు మిషన్లను సమకూర్చుకున్నదన్నారు. నగరంలో సుమారు 780 కి.మీ. పరిధిలోగల 38,700 భూ గర్భ డ్రైనేజి హోల్స్ ను మానవ రహిత నిర్వాహణ కొరకు ఈ రెండు మిషన్లు వినియోగించడం వలన, స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన ర్యాంకు సాధనకు తోడ్పడుతుందని కమిషనర్ ఆశాభావాన్నివ్యక్తీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు శ్యాంసన్ రాజు, వేణుగోపాల్, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, సిటీ ప్లానర్ ప్రభాకర్, మూడవ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ అమ్మాజీ, కార్యనిర్వాహక ఇంజినీరు(నీటి సరఫరా) శ్రీనివాస్, డి.ఇ. మహేష్, మెకానికల్, నీటి సరఫరా విభాగపు ఇంజినీరింగు అధికారులు తదితరులు పాల్గోన్నారు.