నాడు ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన దివంగత మహానేత వైయస్ఆర్ అయితే ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేడు అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం సోదరుల ఉన్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నివెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత మచిలీపట్నం టెక్యా ప్రాంతానికి చెందిన కొందరు ముస్లిం మహిళలు మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. తమ పిల్లలకు విద్యా దీవెన డబ్బులు రావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మీ పిల్లల చదువుల వివరాలు నాకు తెలియచేయండి. తాను తప్పక విచారణ చేస్తానని హామీ ఇచ్చారు. 2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన తరువాత ముస్లిం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ద్రోహద పడేలా రిజర్వేషన్ కల్పించడం అత్యవసరమని భావించి 4% రిజర్వేషన్ ఏర్పరచెరన్నారు. ఆ రిజర్వేషన్ ఫలితంగా ముస్లిం సమాజము విద్య ,ఉపాధి రంగాలలో గణనీయమైన ప్రాధాన్యత పొందడం ఎంతో అభినందనీయమన్నారు. స్థానిక పేర్ని కృష్ణమూర్తి కాలనీకు చెందిన కొల్లేరు విజయలక్ష్మి తనకు అయిదు నెలలుగా పింఛన్ రావడం లేదని బియ్యం కార్డు నిలిచిపోతుందని మంత్రి కి తెలిపింది. తనకు ఆధార్ కార్డు ,రేషన్ కార్డు తదితర వివరాలు ఎందుకు తీసుకోని రాలేదమ్మా అని ఆమెని అడిగి అవి వెంటనే అందచేయాలని మంత్రి పేర్ని నాని అడిగారు. స్థానిక హుస్సేనుపాలెం యానాదుల కాలనీకి సమీపంలో నివసిస్తున్న మందా రాజేష్ అనే దివ్యంగుడు మూడు చక్రాల సైకిల్ పై భార్యతో సహా వచ్చి మంత్రిని కలిశారు. కొద్ది సంవత్సరాల క్రితం లారీ తనను ఢీ కొట్టిందని తనకు రెండు కాళ్ళు తొలగించారని తెలిపారు ఆర్ధిక ఇబ్బందులతో ఎంతో ఇబ్బందులు పడుతున్నానని తనకు ఇంటి స్థలం లేదన్నారు. రాజేష్ దుస్థితికి జాలిపడిన మంత్రి తప్పకుండా నీకు నివేశన స్థలం ఇస్తానని , కానీ ఆ స్థలం నీ భార్య పేరిట ఉంటుందని తెలిపారు. బందరు మండలం పెద కొత్తపూడి గ్రామానికి చెందిన మాదిరెడ్డి ఏసు అనే రైతు మంత్రిని కలిశారు. తనకు రైతు భరోసా డబ్బులు రాలేదని, దస్తావేజులు లేకపోవడంతో ఆ డబ్బు రాదనీ అధికారులు చెడుతున్నారని పేర్కొన్నాడు.