ఇళ్లపంపిణీకి ఏర్పాటు పూర్తిచేయాలి..


Ens Balu
2
Kakinada
2020-12-08 20:27:23

 నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ స్ధలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయము నుంచి జిల్లా, డివిజన్, మండల స్ధాయి అధికారులతో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళ స్ధలాల పంపిణీ, జగనన్న భూ హక్కు, భూరక్ష పధకం , ధాన్యం కొనుగోలు,సంబంధిత సమస్యలు , బియ్యం కార్డుల మ్యాపింగ్, కోవిడ్ -19 చేపట్టిన 50 రోజుల అవగాహన కార్యక్రమాలు, వ్యర్ధ పదార్ధాల పై పోరు, మహిళా సాధికారత చట్టాల పై 100 రోజుల అవగాహన కార్యక్రమాలు, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులు , వైయస్ఆర్ బీమా, జగనన్న తోడు, చేయూత, గొర్రెలు-మేకల పంపిణీ, మొబైల్ ట్రక్స్ లబ్దిదారుల ఎంపిక, తదితర అంశాలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఈ నెలలోనే ప్రభుత్వ పరంగా  పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయన్నారు. 10వ తేదీన గొర్రెల-మేకల యూనిట్ల పంపిణీ, 15వ తేదీన 2019 సంవత్సరంలో రైతులకు పెండింగ్ లో ఉన్న క్రాప్ ఇన్సురెన్స్ విడుదల, 21న భూహక్కు, భూరక్షా పధకాల ప్రారంభం, 25వ తేదీన ఇళ్ళ పట్టాల పంపిణీ జరుగనున్నందున అధికారులు ఆయా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలక్టర్ తెలిపారు. జిల్లా లో తొలి దశలో భాగంగా 1.48 లక్షల మందికి ఇళ్ళ పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఇళ్ళ స్ధలాల కోసం సిద్ధం చేసిన లేఅవుట్స్ కు దగ్గర ఉన్నఇసుక స్టాక్ పాయింట్లను మేపింగ్ చేయాలన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 25న జిల్లాలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నందున అధికారులు ఈ కార్యక్రమం పై ప్రధానంగా దృష్టిపెట్టాలన్నారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ఇసుకను రవాణా ఖర్చుల మినహా, ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జియో ట్యాగింగ్, మేపింగ్, లబ్దిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు వెంటనే పూర్తి చేయాలని కలక్టర్ తెలిపారు.

రైతులను ఆదుకోవడంలో అధికులు చొరవ చూపాలి- జేసి లక్ష్మిశః

జిల్లాలో వర్షాలు, తుఫానుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అధికారులు చొరవ చూపాలని జాయింట్ కలక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మిశ తెలిపారు.  రంగు మారిన ధాన్యం కొనేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దీనికి సంబంధించి జిల్లా స్ధాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫోన్ లను ఆయా మండలాలకు పంపడం జరుగుతుందని, వాటిన వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ  నెల 21వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూ హక్కు, భూ రక్షా పధకాలు ప్రారంభించనున్నందున అధికారులు భూ సర్వే పై దృష్టి పెట్టాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామంలో జరిగే రీ సర్వే పై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కరపత్రాలు , అవగాహనా సదస్సలు నిర్వహించాలని జేసి అధికారులకు సూచించారు.  ఈ-క్రాప్ బుకింగ్ లో కౌలు రైతుల వివరాలు నమోదుకు అవకాశం కల్పించినందున దీని పై కౌలు రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించి వారి వివరాలు నమోదు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న బియ్యం కార్డుల మేపింగ్ వెంటనే పరిష్కరించాలన్నారు. ఇళ్ళ పట్టాలకు సంబంధించి పట్టాల ముద్రణకు లబ్దిదారుల వివరాలు పంపించాలని జేసి తెలిపారు. 

అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కీర్తీ చేకూరి.

కోవిడ్-19కు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 50 రోజుల 

అవగాహనా కార్యక్రమాలు సక్రంమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలక్టర్(అభివృధ్ధి) కీర్తీ చేకూరి అధికారులను ఆదేశించారు. 50 రోజులకు రోజు వారీ ఏ కార్యక్రమాలు అమలు చేయాలో ప్రణాళిక లో నిర్దేశించిన ప్రకారం అన్ని ప్రాంతాల్లో అమలయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ ,కార్యక్రమాలకు సంబంధించి వాలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. ఈ 50 రోజుల అవగాహన కార్యక్రమంలో ప్రధానంగా పారిశుధ్యంతో పాటు కోవిడ్ పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా వ్యర్ధాల పై పోరు, మనం- మన పరిశుభ్రత కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యే విధేంగా చూడాలని జేసి తెలిపారు. గ్రామ స్ధాయిలో ఖాళీలుగా ఉన్న ప్రాంతాలలో గ్రీన్ అంబాసిడర్ లను నియమించాలన్నారు. గ్రామ స్ధాయిలో పారిశుధ్యం పై పంచాయతీ సెక్రటరీలు ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. మహిళా సాధికారతా, హక్కులు, చట్టాల పై మహిళలకు అవగాహన కల్పించు నిమిత్తం 100 రోజులు నిర్వహించే కార్యక్రమాలు జిల్లా స్ధాయి నుండి గ్రామ స్ధాయి వరకు అమలయ్యే విధంగా చూడాలన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో మహిళల సమస్యల పరిష్కారం నిమిత్తం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులతో ర్యాలీలు నిర్వహణ, స్వయం సహాయక సంఘాల మహిళలతో అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. వైయస్ఆర్ బీమాకు సంబంధించి బ్యాంకర్ల లాగిన్ లో ఉన్న దరఖాస్తులను ఎంపిడిఓలు ఆమోదించాలని జేసి కీర్తీ చేకూరి తెలిపారు.

ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి- జి.రాజకుమారిః

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను అధికారులు సమన్వయంతో పని చేసి నిర్మాణ పనుల్లో పురోగతి చూపించాలని జాయింట్ కలక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి అన్నారు. మంజూరు చేసిన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. వైయస్ఆర్ చేయూత పధకంలో భాగంగా 10వ తేదీన లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నందున బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆమె తెలిపారు. జిల్లాలో మనీ ట్రక్ ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఆమె తెలిపారు. నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమం 2021 జనవరి 1 నుండి ప్రారంభించనున్నందున లబ్దిదారుల జాబితాను సిధ్ధం చేయాలని జేసి రాజకుమారి అధికారులకు సూచించారు.  ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్ధాయి అధికారులు, డివిజన్ , మండల స్ధాయి అధికారులు పాల్గొన్నారు.