విధినిర్వహణలో ఎంత కర్కశంగా ఉంటారో..మానవత్వం చాటడంలోనూ అంతే దాద్రుత్వాన్ని చాటుకున్నా విశాఖజిల్లా కలెక్టర్.. కలెక్టర్ చొరవతో రెవిన్యూలో అపస్మారక స్తితిలోకి వెళ్లిన ఉద్యోగికి మంచి వైద్యం అందుతోంది. జిల్లాకలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్న విషయం తెలియడంతో రెవిన్యూ ఉద్యోగులు కూడా తమవంతు సహకారం అందించారు. వివరాలు తెలుసుకుంటే రెవిన్యూ శాఖలో రాంబిల్లి రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నకే. విజయ్ భాస్కర్ కు ఇటీవల ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన షీలానగర్లోని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఆపస్మరక స్థితిలోకి వెళ్లిన ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స కు స్పందిస్తున్నారని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ ఉద్యోగులు అండగా నిలబడి ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు సమీకరించి విశాఖపట్నం జిల్లా రెవిన్యూ అధికారి ఆశపు ప్రసాద్ ద్వారా విజయ్ భాస్కర్ సతీమణి శ్రీదేవికి అందించారు. విజయ్ భాస్కర్ కు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వి వినయచంద్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. అంతేకాకుండా ఉద్యోగిని అన్ని విధాలా ఆదుకోంటామని, అధైర్య పడవలసిన అవసరం లేదని కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఇంకా మిత్రులు, శ్రేయోభిలాషులు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి రవికుమార్, కార్యదర్శి వై శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షులు బంటు రమణ, ఎమ్ వి సుబ్బారావు, కోశాధికారి ఎస్ సురేష్, జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి శ్రీ రామ్మోహన్ రావు మరియు గ్రామ రెవిన్యూ అధికారి ఎమ్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. కష్ట కాలంలో తమకు అండగా నిలిచిన రెవెన్యూ ఉద్యోగులకు, జిల్లా అధికారులకు విజయ్ భాస్కర్ భార్య శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. ఆపద కాలంలో తోటి ఉద్యోగికి బాసటగా నిలిచిన రెవిన్యూ ఉద్యోగులను, ముందుండి కార్యక్రమాన్ని నడిపించినందుకు సంఘం కార్యవర్గ సభ్యులను జిల్లా రెవిన్యూ అధికారి అభినందించారు.