ఆచార్య కట్టిమణికి జాతీయ పురస్కారం..
Ens Balu
2
Vizianagaram
2020-12-09 16:29:10
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తేజస్వి కట్టిమణికి జాతీయ స్థాయి అత్యున్నత పురస్కారం వరించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 157 వసంతాల చరిత్ర కలిగిన కన్నడ సాహిత్య పరిషత్ ఈ సంవత్సరానికి గాను "ప్రొఫెసర్ మరిదేవరు మెమోరియల్ కన్నడ సాహిత్య పరిషత్ అవార్డు 2020" కొరకు ప్రొఫెసర్ తేజస్వి కట్టిమణి ని గిరిజనుల విద్యను విస్త్రుత పరిచినందుకు గాను ఎంపిక చేశారు. పురస్కారాన్ని కర్ణాటక లోని బెంగళూరు సాహితి పరిషథ్ ఆడిటోరియం లో ప్రధానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కింద రూ.20వేలు నగదును అందజేశారు. ఆ రివార్డును కన్నడ సాహితి పరిషద్ అధ్యక్షుడు డాక్టర్ మను బడీగార్, కన్నడ ప్రభుత్వ డిపార్ట్మెంట్ అఫ్ కన్నడ అండ్ కల్చర్ డైరెక్టర్ డాక్టర్ రంగప్ప లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కట్టిమని మాట్లాడుతూ, ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరు రాజు దివాన్ గా ఉన్నపుడు 157 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కన్నడ సాహిత్య పరిషత్ జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో కృషి చేసిన నిష్ట్నాతులైన నిపుణులను ఎంపిక చేసి ఈ అవార్డును ప్రధానం చేస్తుందన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక అవార్డు ఈ సంవత్సరానికి గాను తనకు వరించడం.. అదీ తాను ఎక్కువగా కృషి చేసిన గిరిజన విద్యా వ్యవస్థలో రావడం తనకు ఏంటో ఆనందం గా ఉందన్నారు. ఈ అవార్డు తనపై మరింత భాద్యతను పెంచిందన్నారు. సిటియు ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ హెచ్. లజపతి రాయ్, గిరిజన విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వి ఎస్ సూర్యనారాయణతో పాటు పలువురు ఆచర్య కట్టిమణి కి అభినందనలు తెలిపారు.