శాశ్వత భూపరిష్కారానికే రీ సర్వే..
Ens Balu
2
Srikakulam
2020-12-09 16:33:43
శాశ్వత భూ పరిష్కారానికి రి సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ముఖ్య మంత్రి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్రంలో వున్న అన్ని రెవిన్యూ గ్రామాల్లోని, అగ్రికల్చర్ భూమి, ఇంటి స్థలాలు పూర్తి స్థాయిలో రి-సర్వే కార్యక్రమం చేపట్ట నున్నారని తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 21 నుంచి జూలై 2021 వరకు 5వేల రెవిన్యూ గ్రామాలలోను, రెండవ విడతలో ఆగష్టు 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు 6,500 రెవిన్యూ గ్రామాలలో, 3వ విడతలో జూలై 2020 నుంచి జనవరి 2023 వరకు మిగిలిన 5,500 రెవిన్యూ గ్రామాలలోను సర్వే చేయడం జరుగుతుంది అని చెప్పారు. సర్వే అనంతరం భూమి యజమానికి భూమికి సంబంధించిన యు.ఐ.డి, టైటిల్ కార్డ్ ఇవ్వడం జరిగుతుందన్నారు. గ్రామాలలో వివరాలను డిస్ప్లే చేయడం జరుగుతుందని, రెండు సంవత్సరాల పాటు అబ్డర్వేషన్ లో వుంచుతారని తెలిపారు. ఈ లోగా అభ్యంతరాలు వుంటే రెండు సంవత్సరాలలో తెలిపాలని చెప్పారు. వాటిపై తగు చర్యలు తీసుకుని శాశ్వత భూపరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. టైటిల్ కార్డులో గ్రామాలు, హేబిటేషన్ తో సహా మ్యాపింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇకపై సచివాలయాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పని చేస్తాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా వారసులకు వ్యవసాయ భూములు కాని, ఇళ్ళు కాని, ఇంటి స్థలాలను అందించడం జరుగుతుందని తెలిపారు. డ్రోన్ల సాయంతో సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. మండలాలలో మొబైల్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలలో ల్యాండ్ ట్రిబ్యునల్ ను డిశంబరు 15 లోగా ఏర్పాటు చేయాలన్నారు. సర్వే ప్రారంభం కావడానికి ముందుగాని విలేజ్ బౌండరీసు, విలేజ్ సైట్లను మార్కింగ్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భూ రక్షణ రాళ్ళను కొనుగోలు చేయు నిమిత్తం టెండరు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ప్రతీ మండలంలోను డాటా ప్రోసెసింగ్, డ్రోన్, రి-సర్వే లతో కూడిన టీమ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. డిశంబరు 7 నుండి 11 వ తేదీ లోగా ఇంటింటికీ వెళ్ళి సమగ్ర భూసర్వే పై ప్రజలకు అవగాహన చేయాలన్నారు. డిశంబరు 14 నుండి 19 వ తేదీ లోగా గ్రామాలలోను, వార్డులలోను గ్రామ సభలను నిర్వహించాలని సి.ఎం. తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల మంది సర్వేయర్ లను నియమించామని, వారికి శిక్షణ నిస్తున్న ట్లు చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రధ్ధ మరియు పర్యవేక్షణ చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్, సంయుక్త కలెక్టర్ సుమీత్ కమార్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు ఎ.డి. ప్రభాకర్ రావు, ఇన్ స్పెక్టర్ కె.రామకృష్ణ, డివిజనల్ ఇంజనీరింగ్ సర్వేయరు జి.వెంకట రావు తదితరులు హాజరైనారు.