కరోనా నియంత్రణకు అప్రమత్తత అవసరం..


Ens Balu
4
Srikakulam
2020-12-12 21:36:55

రోనా నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామాత్యులు  ధర్మాన కృష్ణదాస్ అన్నారు.  శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా ప్రపంచాన్ని గడ గడ లాడించిన తరుణంలో మన రాష్ట్రంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు.  అత్యధికంగా  కరోనా పరీక్షల నిర్వహించిన రాష్ట్రం మనదేనన్నారు.  మన జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాలతో పాటు మన జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో యంత్రాంగం మంచి సేవలను అందించిందని తెలిపారు. ఆ చర్యల ఫలితంగా కరోనా తగ్గుదలలో సఫలీకృతులం అయ్యామని తెలిపారు.  మన జిల్లాలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ప్రజలను నిరంతరం అప్రమత్తత చేయడం జరిగిందని  తెలిపారు.  వలస కార్మికుల రాక వలన కరోనా వ్యాధి ప్రబలినా, వైద్య ఆరోగ్య శాఖ, రెవిన్యూ శాఖ, పోలీసు శాఖ, తదితర ప్రభుత్వ యంత్రాంగం అందించిన నిరంతర సేవల ఫలితంగా డిశంబరు నాటికి తగ్గుదల వచ్చిందన్నారు.  అనేక దేశాలలో సెకెండ్ వేవ్ ప్రారంభమైనందున మనం ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలను కొనసాగించవలసిన అవసరం వుందన్నారు.  ఇందు నిమిత్తం ప్రభుత్వం, డిశంబరు ఒకటవ తేదీ నుండి జనవలి 19వ తేదీ వరకు 50 రోజులు కేంపెయిన్ నిర్వహిస్తున్నదని తెలిపారు.  కరోనా ప్రబలకుండా  మనమంతా కలసికట్టుగా పని చేయాలని కోరారు.  ముఖ్యంగా మనది వ్యవసాయాధారిత జిల్లా కావున సంక్రాంతి పండుగను ఘనంగా జరిపించుకోవడం జరుగుతుందని, బంధు మిత్రులతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీ అని తెలిపారు.  గ్రామాల నుండి పట్టణాలకు షాపింగుల కోసం రావడం జరుగుతుందని చెప్పారు. ఈ నేపధ్యంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా మరింత అప్రమత్తత అవసరమన్నారు. వాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా వుండాలని కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు.           రాష్ట్ర  శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, కరోనాను పూర్తిగా నిర్మూలన చేయడానికి ప్రభుత్వం 50 రోజులు పోజిటివ్ వార్ ప్రకటించిందన్నారు.  కోవిడ్ నుండి పూర్తి రక్షణ కోసం ప్రభుత్వం 50 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు.  రైతుల పండుగ సంక్రాంతి, కుటుంబ సమేతంగా చేసుకునే ఆంధ్రుల పండుగ అని, మనందరం జాగ్రత్తలు పాటించాలని అన్నారు.  మార్చి నుండి నేటి వరకు జిల్లా యంత్రాంగం ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్  కరోనా కట్టడికి శక్తి వంచన లేకుండా అవిశ్రాంతంగా పని చేసారని తెలిపారు.  ప్రపంచం మొత్తంలో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించిన సమయంలో మనం కూడా కొంత కరోనాకు గురి కావడం జరిగిందన్నారు.  మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.  ఇందుకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్, వైద్య సిబ్బంది, వాలంటీర్లతో సహా అందరూ మంచి సేవలను అందించారని తెలిపారు.  ప్రభుత్వం కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా అడ్డుకోవడానికి 50 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రభుత్వ శాఖలన్నీ పాల్గొంటాయని తెలిపారు.  ప్రింట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా   ఈ కరోనాతో యుధ్ధం అనే ఉద్యమంలో పాల్గొని  తమ వంతు   సహకారం అందించాలసి కోరారు.                                       జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరాటానికి 50 రోజులు ప్రణాళికను రూపొందించడం జరుగిందన్నారు.  వాలంటీర్లు  ఈ 50 రోజుల పాటు ఇంటింటికీ వెళ్ళి మాస్కు వుపయోగించటం, సానిటైజరు వుపయోగించుకునే విధానం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత తదితర విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించడం జరుగుతున్నదన్నారు.  ఈ నెల 1వ తేదీన కార్యక్రమం ప్రారంభమైనదని,  2020 జనవరి 19 వ తేదీ  వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రెవిన్యూ, ఇండస్ట్రీస్, సివిల్ సప్లైస్, ఎగ్రికల్చర్, లేబల్ డిపార్టు మెంటు, ఎండోమెంట్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, స్వయంశక్తి సంఘాలు, ఆటో వారు, ఉపాధిహామీ పని వారు, స్వఛ్ఛంద సంస్థలతో విస్తృతంగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  సెకెండ్ వేవ్ ప్రబల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ కరోనా పూర్తి నివారణకు సహకారం అందించాలన్నారు.