కరోనాపట్ల అప్రమత్తత చాలా అవసరం..
Ens Balu
2
Anantapur
2020-12-12 22:44:39
కరోనా వైరస్ పట్ల అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (గ్రామ /వార్డు సచివాలయాలు,అభివృద్ధి) డాక్టర్. ఏ .సిరి తెలిపారు .శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి తో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ .ఏ. సిరి మాట్లాడుతూ, పశ్చిమ దేశాల్లో కరోనా రెండవ దశ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు ఎవరు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ 19 నియంత్రణలో భాగంగా జిల్లాలో డిసెంబర్ 1 నుంచి జనవరి 19 వరకు 50 రోజుల పాటు వివిధ శాఖల భాగస్వామ్యంతో ముమ్మురంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, జాగ్రత్తలు పాటిస్తే, మన ఆరోగ్యం - మన చేతుల్లో ఉంటుందన్న విషయాలపై జిల్లాలోని ప్రజలకు 50 రోజులపాటు అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నామన్నారు.
జిల్లాలో కరోనా కేసులు తగ్గాయని ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని, మాస్కు ధరిస్తూ భౌతిక దూరం పాటించడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. కరోనా వైరస్ ప్రబలినప్పుడు ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారో అదే జాగ్రత్తలను ఇప్పుడు కూడా తీసుకోవాలన్నారు. "మాస్క్ సరిగా పెట్టు... కరోనా ఆటకట్టు", "ఆరు అడుగుల దూరం... కరోనా మీకు దూరం", చేతులశుభ్రం... ఆరోగ్యం భద్రం/ మన ఆరోగ్యం - మన చేతుల్లో" అనే అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకునేలా ఇప్పటివరకు జిల్లా మరియు63మండల స్థాయి అధికారులు,స్వచ్ఛంధ సంస్థలు,విద్యాశాఖ, రవాణాశాఖ,స్కిల్ డెవలప్మెంట్, జిల్లా మైనారిటీ సంక్షేమం, పంచాయతీరాజ్ ,గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,డి ఆర్ డి ఎ,మెప్మా శాఖల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిచడం జరిగిందన్నారు.
విద్యాశాఖ ద్వారా జిల్లాలోని 621 పాఠశాలలో, 4473 మంది టీచర్లు, 25,611మంది విద్యార్థులకు, ప్రజా రవాణా శాఖ ద్వారా 11 బస్సు డిపోలల్లో, జిల్లాలోని ఆరు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ల ద్వారా 160 మందికి అవగాహన కల్పించామన్నారు. అలాగే జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మార్కెట్ యార్డ్ చైర్మన్, ప్రభుత్వ ఖాజీలు,పాస్టర్లు ,ఇతర మత పెద్దలతో సమావేశాన్ని నిర్వహించి మసీదులు ,చర్చిలలో ప్రార్ధనా సమయంలో భౌతిక దూరాన్ని పాటించాలని, కరోనా నివారణపై చర్యలు చేపట్టాలని ,మాస్కులు ధరించాలని , చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు .జిల్లా పంచాయతీ శాఖ ద్వారా 1044 పంచాయతీలలో సమావేశాలు నిర్వహించి, మైకుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ, కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ, వాటిపై రూపొందించిన మూడు రకాల పోస్టర్లను1044 గ్రామ పంచాయతీల్లో 3132 పోస్టర్లను ప్రదర్శించడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో, 345 వార్డులలో మైకుల ద్వారా ప్రచారం, 165 హోర్డింగులఏర్పాటు, చేతులు పరిశుభ్రంగా ఉంచడం పై 516 సమావేశాలు నిర్వహించడమే కాకుండా కళాజాతాల ద్వారా కూడా అవగాహన కల్పించారన్నారు .డీఆర్డీఏ ద్వారా జిల్లా సమాఖ్య, 63 మండల సమాఖ్యలు, 2880 గ్రామ సంఘాలలో సమావేశాలు నిర్వహించి 4,27,682మందికి మాస్క్ కవచం, ఆరు అడుగుల దూరం, చేతులు శుభ్రం లపై అవగాహన కల్పించామన్నారు.ఇదే అంశాలపై మెప్మా ద్వారా 12 మున్సిపాలిటీలలో 2480 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, 17 ర్యాలీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో62000 మంది సభ్యులు పాల్గొన్నారన్నారు. ఏఎన్ఎం, ఆశ, మరియు వాలంటీర్లతో 1500 టీములు ఏర్పాటుచేసి 2350 మంది గ్రామ సెక్రటరీలు, వాలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు.1980 పోస్టర్లను ప్రదర్శించడం జరిగిందని 2500 నివాసాలలో మైకుల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో అధికారుల సమిష్టి కృషితో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు .తద్వారా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిందన్నారు. అయినప్పటికీ ప్రజలు అజాగ్రత్తగా ఉండకుండా ,ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల,2021,జనవరి మాసాలలో క్రిస్మస్ ,జనవరి 01, భోగి,సంక్రాంతి,కనుమ పండుగలు వస్తున్నందున ప్రజలు ప్రార్థనలు ,పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, తదితర కార్యక్రమాల్లోఅధికసంఖ్యలో పాల్గొంటారనన్నారు.ఈ పండుగ సందర్భంగా ప్రజలెవ్వరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని మీడియాద్వారా తెలియజేస్తున్నామన్నారు.
డిఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 రోజుల పాటు కరోనా నివారణ- తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి వివిధ శాఖల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డెమో ఇంచార్జ్ ఉమాపతి, డిప్యూటీ హెచ్ ఓ గంగాధర్,హెల్త్ ఎడ్యుకేటర్లు చంద్రశేఖర్రెడ్డి ,రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.