రేపటి నుంచి జిల్లాలో గ్రూప్-1 పరీక్షలు..
Ens Balu
1
Srikakulam
2020-12-13 20:04:25
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 1 పరీక్షలు జరగనున్నాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలను తూ. చ తప్పకుండా పాటించాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను దరిస్తూ చేతులను సానిటైజ్ చేసుకోవాలని చెప్పారు. ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజినీరింగ్, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో జరగనున్న ఈ పరీక్షలకు 312 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతీ రోజూ ఉదయం 10.00గం.ల నుండి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. సకాలంలో రాని అభర్థులను లోనికి అనుమతించరని అన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థుల కొరకు ఆర్.టి.సి బస్సులను ఏర్పాటుచేసిందని తెలిపారు. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు ప్రతి, కలం, ట్రాన్స్ ప్రెరెంట్ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆధార్ లో ఇంటి పేరు మారిన అభ్యర్థులు ప్రూఫ్ తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఏదైనా సమస్యలు తలెత్తితే ఏ.పి.పి.యస్.సి సెక్షన్ ఆఫీసర్ పైడి ఢిల్లీశ్వరరావు,సెల్ 90145 50915 నెంబరును సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని డి.ఆర్.ఓ ఆ ప్రకటనలో వివరించారు.