చేనేత కార్మికులకు చేయూత..


Ens Balu
2
Srikakulam
2020-12-13 20:06:46

చేనేత కార్మికులకు చేయూత నందించడానికి చర్యలు తీసుకోనున్నట్లు హాండ్లూమ్స్ డైరక్టర్ , ఆప్కో మేనేజింగ్ డైరక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్  ఐ.ఎ.ఎస్. తెలిపారు.  ఆదివారం ఆయన జిల్లాలో పర్యటించారు.  ఆప్కో షో రూమ్స్, హాండ్లూమ్స్ కార్యాలయం, చేనేత షాపింగ్ కాంప్లెక్స్, డివిజనల్ మార్కెటింగ్ కార్యాలయాలను సందర్శించారు.  చేనేత కార్మికులతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు.  అనంతరం పొందూరు, రాజాం చేనేత సహకార సంఘాలను, షోరూమ్ లను సందర్శించి అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడారు.  అక్కడ నిల్వ వున్న స్టాక్,  చేనేత మగ్గాలను స్వయంగా పరిశీలించారు.  చేనేత కార్మికులకు చేయూత నిచ్చి వారి స్థితిగతులను మెరుగుపరచనున్నామని వారికి తెలిపారు.  ఇందు నిమిత్తం వారు నేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తామని,   వారికి ముద్ర రుణాలను అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.   ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి సహాయ సంచాలకులు డా.వి.పద్మ, ఆప్కో జెనరల్ మేనేజర్ రమేష్ బాబు, డివిజనల్ మార్కెటింగ్ అధికారి ఉమాశంకర్, హాండ్లూమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.