సమగ్ర భూసర్వే భూములకు శ్రీరామ రక్ష..
Ens Balu
1
Srikakulam
2020-12-13 20:22:47
భూముల సమగ్ర సర్వే ద్వారా యజమానుల భూములకు రక్షణ లభిస్తుందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు ప్రభాకర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వంద సంవత్సరాల అవంతరం రాష్ట్ర ప్రభుత్వం ఒక మహా యజ్ఞంలా సమగ్ర భూ సర్వేను రాష్ర్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నదని సదరు ప్రకటనలో వినరించారు. వై.యస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకం ద్వారా చేయపడుతున్న కార్యక్రమమే మీ భూమి మా హమీ కార్యక్రమమని సర్వే సహయ సంచాలకులు ప్రభాకర రావు అన్నారు. భూముల రికార్డులు భూమి స్ధితికి ప్రతిబింబించేలా లేకపోవటం వలన భూముల అమ్మకానికి, కొనుగోలు చేయటానికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగ వలసిన పరిస్థితికి స్వస్తి చెప్పడం జరుగుతుందన్నారు. దీని వలన భూముల కొనుగోలు, అమ్మకాలలో ఇబ్బందులు తొలగి పోతాయని, టైటిల్ రిజిస్ట్రేషన్ అమలులోకి రావటం వల్ల ఈ సమస్యలన్నీ సమసిపోతాయని చెప్పారు.
ఆస్తి యజమానుల శ్రేయస్సు కోసం శాశ్వత హక్కు నిర్దారించడం, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ 2019 ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. భూమి మరియు రెవిన్యూ రికార్డులను అనుసంధానించడం కోసం సమగ్ర భూ సర్వే కార్యక్రమం వై.యస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకం ఈ నెల 21 న ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో డిసెంబర్ 14 నుండి 19 తేది వరకు మెుదటి విడతలో భూ సర్వే కార్యక్రమం 645 గ్రామలలో జరుగుతుందన్నారు. ఇందు నిమిత్తం ఏర్పాటు చేయు గ్రామ సభలలో పాల్గొనవలసినదిగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అర్జీలు పెట్టకపోయినా కూడా అన్ని భూములను సంపూర్ణమైన సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. తద్వారా యాజమాన్యపు హక్కు నిర్దారణ రికార్డులలో నిక్కచ్చి నమోదు జరుగుతుందని అయన తెలిపారు.
సమగ్ర భూసర్వే కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా ప్రజలు చూపించిన హద్దులలో వారి సమక్షంలోనే ఖచ్చితమైన కొలతలతో సర్వే చేయడం జరుగుతుందన్నారు. భూములుపై శాశ్వత హక్కు లభిస్తుందని, ప్రతీ కమతానికి మ్యాపింగా చేయడం జరుగుతుంది యు.ఐ.డి. నెంబరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.