ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి..
Ens Balu
3
Kakinada
2020-12-13 22:29:33
రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం కాకినాడ బొట్ క్లబ్ దగ్గర్లో ఉన్న కృషి భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం సర్వసభ్య సమావేశానికి మంత్రి కన్నబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభించిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తూ, వ్యవసాయ రంగంలో అనేక నూతన వ్యవస్థకు నాంది పలికిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల లో గతంలో ఏ ప్రభుత్వం భర్తీ చేయలేనని ఉద్యోగాలు ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. గ్రామ స్థాయి లో రైతుకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తీసుకు రావడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మత్స్య శాఖకు సంబంధించి మత్స్య ప్రాసెసింగ్ సెంటర్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని పట్టుదలతో,ఉత్తమ ఫలితాలు అందించే విధంగా కృషి చేయాలన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారుల పదోన్నతులకు సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని,నూతనంగా ఎన్నికైన రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం సభ్యులందరూ వ్యవసాయరంగ ఉన్నతికి కృషి చేయాలని మంత్రి కన్నబాబు సుచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఏపీఎన్జీవో అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసు రావు, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం అధ్యక్షులు డి.వేణుమాధవ రావు, 13 జిల్లాల విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.