విద్యార్థులు బహుముఖంగా రాణించాలి..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-14 22:03:32
విద్యార్థులు బహుముఖంగా రాణిస్తూ తమ నైపుణ్యాలను ప్రస్పుటం చేయాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ ఇంజీనింగ్ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న జనరల్ ఇంట్రెస్ట్ టాపిక్స్ అవెన్యూ (గీతా) పోస్టర్‌ను ఆయన సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సాంకేతికతను లాభదాయకంగా నిలుపుకుంటూ వర్చువల్ విధానంలో కార్యక్రమాలను నిర్వహించడం పట్ల విద్యార్థులను అభినందిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు టెక్ టాక్స్‌ను నిర్వహిస్తారు. కార్యక్రమంలో విద్యార్థి కన్వీనర్ ఏ.వినీల్ జడ్సన్ తదితరులు పాల్గొన్నారు.