ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నద్దం కావాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-12-14 22:06:33

 ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు నవరత్నాలులో భాగంగా పేదలందరికీ ఇళ్లు పధకంలో పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాలు, లే-అవుట్ లు సిద్దం చేయాలని జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరు కార్యాలయం సమావేశమందిరంలో అధికారులతో ఈ విషయం పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సంధర్బంగా ఆయన సమీక్షిస్తూ  మండలాల వారీగా లేఅవుట్ లు, పట్టాల వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం  ప్రతి నియోజకవర్గంలో  శాసనసభ్యులు ఇండ్లస్థలాలు, పట్టాలు పంపిణీ చేస్తారని తెలిపారు.  డిశంబరు 25 తేదీ నుండి  జనవరి 7 వ తేదీ వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, 7 వ తేదీ లోపు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని తెలిపారు.  ప్రతి లే అవుట్ దగ్గర  లేఅవుట్ మ్యాప్, లబ్ది దారుల జాబితా ప్రదర్శించాలని అన్నారు.  ఇంటి స్థల పంపిణీ పూర్తయిన వెంటనే ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు.  ఈ కార్యక్రమం పర్యవేక్షణకు గాను ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు.  ప్రత్యేకాధికారులు లే-అవుట్ తయారీ, పట్టాలు తయారీ, పంపిణీ తదితర పనులు పర్యవేక్షించి కార్యక్రమం సజావుగా పూర్తి చేయాలన్నారు.  నవంబరు 25 తేదీనాటికి గల లబ్దిదారులు, 90రోజులలో పరిష్కరించవలసిన ధరఖాస్తుల లబ్దిదారులు, డిశంబరు 15 లోగా సచివాలయాలకు వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల జాబితా తయారు చేయాలన్నారు.  అర్హతగలిగిన  ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చాలని తెలిపారు. లబ్దిదారుల వివరాలను సచివాలయాలలో ప్రదర్శించాలని తెలిపారు.   డి ఫారం పట్టారికార్డు మొత్తం రెవిన్యూ డివిజను కార్యాలయాలలో భద్రపరచాలన్నారు.  లేఅవుట్ వద్దనే  పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని,  పట్టాలలో  పట్టాదారుని పేరు, ప్లాటు నంబరు, సరిహద్దులు తదితర వివరాలు నమోదు చేయాలన్నారు.  ఇంటి స్థల పంపిణీలో అవకతవకలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదుచేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు కేసులకు సంబంధించి స్టే ఉన్న చోట్ల వెకెషన్ పిటిషన్లు వేయాలని, కౌంటరులో  పేరావైజ్ రిమార్క్స్ నోట్ చేయాలని తెలిపారు.   కొత్త  లేఅవుట్ లో భూమి చదును, రోడ్లు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయవలసినదిగా  పి.డి. డుమా, హౌసింగు అదికారులను ఆదేశించారు.  అందుకుగాను తహశీల్దారులు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.     టిడ్కో ఇంటికి సంబందించి 300 చ.అ.  గల ఇంటికి రూ.1/-, 365 చ.అ. ఇంటికి రూ.25,000/-, 430 చ.అ. ఇంటికి రూ.50,000/- ప్రకారం లబ్దిదారుని షేరు కట్టించుకొని రిజిస్ట్రేషను చేయాలన్నారు. జాయింటు కలెక్టరు  వేణుగోపాలరెడ్డి  మాట్లాడుతూ  లే అవుట్లలో అప్రోచ్ రోడ్లు, అంతర్గతరోడ్లు, సరిహద్దురాళ్ల ఏర్పాటు  మొదలైన పనులను  20వ తేదీ లోగా పూర్తిచేయాలన్నారు.  ప్రతి నియోజక వర్గంలో 25 వ తేదీన  స్థానిక శాసనసభ్యులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.  జనవరి 7 వ తేదీలోగా ప్రణాళిక ప్రకారం పంపిణీ పూర్తిచేయాలన్నారు.  సరిహద్దురాళ్లపై ప్లాటు నంబర్లు వేయాలని తెలిపారు.  పంపిణీ కార్యక్రమలో  గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్ల  సేవలు వినియోగించుకోవాలని,  పట్టాలపై తప్పులు, దిద్దుబాట్లు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో  జి.వి.యం.సి. కమీషనరు, జి.సృజన, ఐ.టి.డి.ఎ. పిఒ వెంకటేశ్వర్లు,  నర్సీపట్నం సబ్ కలక్టరు ఎన్. మౌర్య, రెవిన్యూ డివిజనల్ అధికార్లు కె. పెంచల కిషోర్, జె.సీతారామారావు, ఎల్.శివజ్యోతి, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, డి.ఆర్.ఒ. ఎ.ప్రసాదు, పరిపాలనాధికారి రామ్మెహనరావు,హౌసింగు, డుమా అదికార్లు, తహశీల్దార్లు పాల్గొన్నారు.