ఇంధన పొదుపులో భాగస్వాములు కావాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-12-14 22:08:10

నాణ్యమైన విద్యుత్ పరికాలు, 3 లేదా అంతకంటే ఎక్కువ స్టార్లు గల గృహోపకరణాలు వాడటం ద్వారా 25 నుంచి 30 శాతం విద్యుత్తు పొదుపు చేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పిలుపు నిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 వ తేదీ నుంచి 20 వరకు పాటిస్తున్న సందర్భంగా ఆయన కలెక్టర్ కార్యాలయం లో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేయడం వలన కరెంటు బిల్లు ఆదా అవుతుందని, ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. భావి తరాలకు కూడా ఇంధనం నిల్వ వుంటుందన్నారు. అవసరం లేని సమయంలో ఇందనపు పాటించాలనే భావం ప్రతీ ఒక్కరిలోనూ రావాలన్నారు. తద్వారా అందరిలోనూ చైతన్యం కలిగి అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి వీలుపడుతుందని సూచించారు. ఇంధన పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇపిడిసిఎల్ ఎస్.ఇ. సూర్య ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.