వాలంటీర్లు మరింతగా సేవలందించాలి..


Ens Balu
3
Vijayawada
2020-12-14 22:12:28

అర్హత ఉండి ప్రభుత్వ పధకాల ప్రయోజనం పొందని లబ్దిదారులను గుర్తించడంలో గ్రామ వాలంటీర్లు మరింత చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ స్పష్టం చేసారు. స్ధానిక పోరంకిలోని ప్రభునగర్ లో సోమవారం సాయంత్రం యానాదుల కులానికి చెందిన ఏడు లబ్దిదారుల కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులను కలెక్టరు అందజేసారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలు, నిరుపేదలకోసం, వెనుకబడిన వర్గాలవారికోసం ఎ న్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభునగర్ లో గిరిజన తెగలకు చెందిన 38 యానాదికుటుంబాలు నివాసం ఉంటున్నాయని అయితే నిరక్షరాస్యులైనందున వారికి ప్రభుత్వం అందించే కార్యక్రమాలపట్ల అవగాహన లేకుండా ఉందన్నారు. ప్రభుత్వం ఎ ంతో ముందుచూపుతో అర్హతగల లబ్దిదారులను గుర్తించి వారికి పధకాలను ఇంటివద్దనే అందించాలన్న నిర్ణయానికి రావడం జరిగిందన్నారు. అందులోభాగంగానే గ్రామసచివాలయ వ్యవస్ధలను ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్ధను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ప్రభునగర్ లో 38 యానాదుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారిలో కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే ఆధార్ కార్డు కలిగి ఉన్నా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనం పొందలేకపోతున్నారన్నారు. ఈవిషయాన్ని క్షేత్రస్ధాయి పరిశీలనలో తెలుసుకుని గ్రామవాలంటీర్లను ఆదిశగా చైతన్యం చేశామన్నారు. ఇప్పటికే అన్ని కుటుంబాల వివరాలను సేకరించి వారికి ప్రభుత్వ కార్యక్రమాల సంక్షేమం చేరేలాగా ఆధార్ నమోదును చేపడుతున్నామన్నారు. వాలంటీర్లు అందరూ తప్పనిసరిగా వాస్తవ లబ్దిదారులను అర్హత ఉండి ప్రభుత్వ ప్రయోజనాలు అందని లబ్దిదారులను గుర్తించడంలో మరింత చురుకుగా వ్యవహరించాలని కలెక్టరు ఇంతియాజ్ స్పష్టం చేసారు. ప్రభునగర్ పరిధిలో నివాస స్ధలం లేని లబ్దిదారులను గుర్తించి ఈనెల 25న చేపట్టే స్ధలాల పంపిణీ కార్యక్రమంలో లబ్దిదారులను గుర్తించి పేర్లను సిఫార్స్ చేయాలన్నారు. ఈనెల 25న చేపట్టే కార్యక్రమంలో పట్టాలను అందించాలని కలెక్టరు పేర్కొన్నారు. నూతనంగా తెల్లరేషన్ కార్డులు పొందిన ఏడులబ్దిదారుల కుటుంబాలకు కార్డుల అందజేసే కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు (ఆసరా) కె. మోహన్ కుమార్ , జిల్లా గిరిజన సంక్షేమాధికారి రుక్త్మానందయ్య, తహశీల్ధారు భద్రు, కార్యదర్శులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.