అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు..
Ens Balu
3
Visakhapatnam
2020-12-14 22:40:52
విశాఖ జిల్లాలో అర్హులైన వారందరికీ వైయస్ఆర్ భీమా జగనన్నతోడు పధకాలు వేగంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం జివియంసి, డి.ఆర్.డి.ఎ.,యు.సి.డి., బ్యాంకు అధికారుతో ఈ వియమై తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణయించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన పథకాలను అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలన్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవన్నారు. లబ్దిదారులకు ముందుగా అవగాహన కల్పించాలని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అందరికీ భీమా సౌకర్యం వర్తించేలా చేయాలన్నారు. అదే విధంగా జగనన్నతోడు కార్యక్రమంలో చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వారి వివరాలు సేకరించి వారందరికీ జగనన్నతోడు పథకంద్వారా ప్రభుత్వం ఇస్తున్నరూ.10 వేల ఆర్ధిక సహాయం అర్హులందరికీ అందించాలన్నారు. ఈ సమావేశంలో జి.వి. యం.సి. కమిషనరు జి.సృజన, జే.సి. పి.అరుణ్ బాబు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్.వెంకటేశ్వర్, డిఆర్ డిఎ ప్రాజెక్టు డైరక్టర్ వి.విశ్వేశ్వరరావు, జిల్లా పంచాయితీ అధికారి కె.కృష్ణకృమారి, లీడ్ బ్యాంకు మేనేజరు ప్రసాద్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.