స్వచ్ఛభారత్ మిషన్ లో భాగస్వాములు కావాలి..
Ens Balu
2
Visakhapatnam
2020-12-14 22:52:31
విశాఖపట్నంజిల్లా గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛభారత్ మిషన్ పై ప్రచారం నిర్వహించేందుకు సోమవారం జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ రెండు స్వచ్ఛభారత్ మిషన్ ప్రచార రథాలను కలెక్టరు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ జెండా వూపి ప్రారంభించారు. నేటి నుండి ఈ రథాల ద్వారా బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం, వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ వాడకం నిషేదం తో పాటు కోవిడ్-19 పై అవగాహన కార్యక్రమాలను వీడియో సినిమాల ద్వారా ప్రచారం చేస్తారని, రోజుకు 3 గ్రామాల చొప్పున ప్రచార కార్యక్రమాలు 15రోజులు నిర్వహిస్తారని గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీరు రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి.అరుణ్ బాబు, జిల్లాపరిషత్ సిఈఓ నాగార్జునసాగర్ జిల్లా పంచాయితీ అధికారి కె.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.