నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులు..


Ens Balu
2
Visakhapatnam
2020-12-14 22:58:13

పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో  ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ  కార్యక్రమాన్ని  పర్యవేక్షించడానికి   జిల్లా స్థాయి అధికారులను  నియోజక వర్గ  ప్రత్యేక అధికారులుగా  నియమిస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  ఒక ప్రకటనలో  తెలిపారు.  ఈ అధికారులు సంబంధిత నియోజక వర్గాలలో  డిసెంబరు 25వ తేది  నుంచి జనవరి 7వ తేది వరకు  జరగనున్న  పట్టాల పంపిణీ కార్యక్రమానికి  సంబందించి  తహసీల్దారులు  తయారు చేసే  జాబితాలను  పర్యవేక్షిస్తారని  తెలిపారు.   అలాగే రీ సర్వే (వై ఎస్ ఆర్ జగనన్న శాశ్వత  భూ హక్కు 2021 ) కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తారని  తెలిపారు.  పాడేరు అసెంబ్లీ  నియోజక వర్గానికి  ప్రత్యేకాధికారి గా  ఐటిడిఎ  ప్రాజెక్టు  అధికారి  డా. ఎస్. వెంకటేశ్వర్ ను , నర్సీపట్నం నియోజక వర్గానికి  సబ్ కలెక్టర్  ఎన్   మౌర్యను ,  అరకు  నియోజక వర్గానికి  రెవెన్యూ  డివిజినల్ అధికారి  ఎల్ . శివజ్యోతి ని , భీమునిపట్నం నియోజక వర్గానికి రెవెన్యూ డివిజినల్  అధికారి   కె.పెంచల  కిశోర్ ను ,  అనకాపల్లి నియోజక వర్గానికి రెవెన్యూ డివిజినల్  అధికారి  జె.సీతారామరావు ను ,   మాడుగుల  నియోజక వర్గానికి   స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సి.హెచ్ రంగయ్యను ,  చోడవరం  నియోజక వర్గానికి   స్పెషల్ డిప్యూటి కలెక్టర్  ఎం .వి   సూర్యకళ ను ,  ఎలమంచిలి  నియోజక వర్గానికి  స్పెషల్ డిప్యూటి కలెక్టర్  ఎస్ డి అనితను , పాయకరావుపేట  నియోజక వర్గానికి  డి ఆర్ డి ఎ ., ప్రాజెక్టు  అధికారి  వి.విశ్వేశ్వరరావును , పెందుర్తి  నియోజక  వర్గానికి  స్పెషల్ డిప్యూటి కలెక్టర్  కె.పద్మలతను ,  జి.వి.ఎం .సి పరిధిలోని  5 అసెంబ్లీ  నియోజక వర్గాలకు  ప్రత్యేక అధికారిగా   జివి.ఎం సి కమిషనర్ జి. సృజనను నియమిస్తున్నట్లు తెలిపారు.ఈ అధికారులు  తక్షణమే  బాధ్యతలు స్వీకరించి  పేదలందరికి  ఇళ్లు , రీ సర్వే   కార్యక్రమాలను  విజయవంతం చేయాలని  తెలిపారు.