బహిరంగ మల విసర్జనకి స్వస్తి చెప్పాలి..
Ens Balu
5
Srikakulam
2020-12-15 21:07:14
ఆరోగ్య పరిరక్షణకు బహిరంగ మల విసర్జన అలవాటును మానుకోవాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం జె.సి. బహిరంగ మల విసర్జన పై అవగాహన కలిగించు నిమిత్తం గార మండలంలోని రంప చోడవరం, గొంటి గ్రామాలను, శ్రీకాకుళం మండలం ఒప్పంగి గ్రామాలలో పర్యటించారు. గ్రామాలలో గ్రామ సెక్రటరీలు, వాలంటీర్లతో వీధులలో పర్యటించారు. ఆ యా గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణ సంపూర్ణ పారిశుధ్ధ్యంతోనే సాధ్యపడుతుందని వారికి తెలిపారు. బహిరంగ మల విసర్జనను చేయరాదనన్నారు. ప్రతీ ఒక్కరూ మరగుదొడ్డిని నిర్మించుకుని వాడుకోవాలని తెలిపారు. అనంతరం శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ ఆసుపత్రిని సందర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వి.రవికుమార్, వాలంటీర్లు, తదతరులు పాల్గొన్నారు.