కాంపోనెంట్ పనులు పూర్తి కావాలి..


Ens Balu
3
Srikakulam
2020-12-15 21:21:50

ఉపాది హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. ఎంజిఎన్ఆర్ఈజిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ పనులపై కలెక్టర్ నివాస్ మండల అధికారులు, పనులు చేపడుతున్న ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఇంజనీరింగు అసిస్టెంట్లతో  మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, నియోజకవర్గాలలో  వారానికి రూ.15 కోట్లు ఖర్చు చేయాలని ఆయన స్పష్టం చేసారు. కొన్ని నియోజక వర్గాలలో రూ.13 కోట్లు ఖర్చు వరకు చేసారని, లక్ష్యాలను శత శాతం పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేసారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. మండలాలలో పూర్తి స్ధాయిలో సిబ్బంది ఉన్నప్పటికి పనులు ఎందుకు పూర్తి కావడం లేదని పేర్కొంటూ సమన్వయలోపమా లేకా సమస్యలు ఉన్నాయా అని గుర్తించి అధిగమించి పనులు చేయాలని అన్నారు. వారంలో రోడ్ల పనులు ప్రారంభించాలని, సీసీ రోడ్లు వారానికి ఒక కోలో మీటరు ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ ల పనులు  త్వరితగతిన పూర్తి చెయ్యాలని అన్నారు. ఇసుక, సిమెంటు సరఫరాలో సైతం లోటు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, ఆర్ డబ్ల్యూ పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాసరావు, పంచాయితీ రాజ్ పర్యవేక్షక  కె.భాస్కర రావు, ఆర్.డబ్ల్యూ.ఎస్ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సూర్యనారాయణ, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ఏపిడి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.