ఘనంగా అమర జీవి వర్ధంతి..


Ens Balu
2
Srikakulam
2020-12-15 21:32:26

 అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి మంగళ వారం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం ఒబిఎస్ కూడలి వద్ద అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో అమర జీవి చిత్ర పటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ జె నివాస్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరజీవి సేవలను కొనియాడారు. అమరజీవి మనోనిబ్బరంగల వ్యక్తని, ధైర్యసాహాసాలకు మారు పేరు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుటకు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన ఘనుడు అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి, అంకితభావం, కార్యశీలత ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, లయన్స్ సభ్యులు నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.