రైతులకు లబ్ది కలిగే పరిశోధనలు చేపట్టాలి..


Ens Balu
3
Srikakulam
2020-12-15 21:33:51

 రైతులకు లబ్ది కలిగే పరిశోధనలు చేపట్టాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లలర్ డా.ఎ.విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం  నైర అగ్రికల్చర్ కాలేజీ లో  పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  విద్యార్థులు మంచి పరిశోధనలు చేసి జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర వేత్త లుగా ఎదగాలని అన్నారు.  కొత్త రకాల వంగడాలను, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను మేళవించి  వ్యవసాయం, అనుబంధ రంగాలను  అభివృద్ధి చేయాలని తెలిపారు . రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో దిగుబడి తక్కువగా వస్తున్నదన్నారు.   అధిక దిగుబడి కోసం పరిశోధనలు చేపట్టలన్నారు. నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో వర్క్ షాప్ నిర్వహించనున్నామని తెలిపారు. కాలేజీ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు.  అంతర్జాతీయ ప్రమాణాల స్ధాయిలో  మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. కళాశాలను  అత్యున్నత పరిశోధనా కేంద్రంగా   తీర్చి దిద్దే చర్యలు తీసుకోవాలన్నారు.  అన్ని సబ్జెక్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్ పెట్టడానికి యోచిస్తున్నామని, సిబ్బంది కొరతను తీర్చనున్నామని తెలిపారు.   విద్యార్థులకు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు రావడం హర్షదాయకమన్నారు. జాతీయస్థాయి జర్నల్స్ లో ప్రచురణ అయ్యే పేపర్ తయారు చేయాలని తెలిపారు.  కాలేజీ 35 నుండి 13వ స్థానానికి చేరుకొవడం హర్షదాయకమని తెలిపారు. అనంతరం డా.నటరాజ్  తయారు చేసిన పబ్లికేషన్ ను రిలీజ్ చేసారు.   అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, స్టూడెంట్స్ ఓపెన్ జిమ్  ను ప్రారంభించారు.   అనంతరం వైస్ ఛాన్స్లలర్ ను ఘనంగా సన్మానించారు.