రైతుల భీమా ప్రభుత్వమే చెల్లిస్తుంది..


Ens Balu
3
Srikakulam
2020-12-15 21:35:04

బీమా ప్రీమియం రైతుల తరపున ప్రభుత్వం చెల్లిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వై.యస్.ఆర్ ఉచిత పంటల బీమా కార్యక్రమంను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీమా ప్రీమియం రైతుల తరపున ప్రభుత్వం చెల్లింపు చేస్తుందన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మనది అని పేర్కొన్నారు. గతంలో అందరికీ బీమా పరిహారం అందే పరిస్థితి లేదని దానిని అధిగమించి అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతి రైతుకు మంచి జరగాలని చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69.80 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్ల పంటను బీమా చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాలు వలన పూర్తి పారదర్శకత వచ్చిందని ఆయన తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు వద్ద ఇ క్రాప్ వివరాలతో సహా లబ్ది పొందిన రైతుల జాబితా ప్రదర్శించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 10 వేల మంది రైతులకు రూ.3.20 కోట్లు చెల్లింపు జరిగింది.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, శాసన సభ్యులు కంబాల జోగులు, డిసిసిబి అధ్యక్షులు పాలవలస విక్రాంత్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి, జిల్లా కలెక్టర్ జె నివాస్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిడి రాబర్ట్ పాల్, ఉద్యాన శాఖ ఎడి పి.ఎల్.ప్రసాద్, సిపిఓ ఎం.మోహన రావు, రైతులు సీపాన రామారావు, బుక్క కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.