‌ప్రతిభతోనే అపూర్వ అవకాశాలు..


Ens Balu
4
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-15 21:41:18

ప్రతిభతో విద్యార్థులు అపూర్వ అవకాశాలను సొంతం చేసుకోవచ్చునని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో అమెజాన్‌ ‌సంస్థకు భారీ వేతనంతో ఎంపికై 16 మంది విద్యార్థులను ఆయన  అభినందించారు. ఒకే కళాశాల నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు 16 నుంచి 31.5 లక్షల వేతనాలతో అమెజాన్‌ ‌సంస్థకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి భారీ వార్షికవేతనాలో ఉపాధిని సాధించిన విద్యార్థులు విశాఖ నగరానికి బ్రాండ్‌ అబాసిడర్లుగా నిలుస్తారన్నారు. తమ ప్రతిభను ప్రస్పుటం చేస్తూ సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విజ్ఞాన్‌ ‌విద్యా సంస్థల రెక్టార్‌ ‌డాక్టర్‌ ‌వి.మధుసూధన రావు మాట్లాడుతూ తొలి దశలో తమ విద్యా సంస్థల నుంచి 135 మంది విద్యార్థులు అమెజాన్‌, ‌సిస్కో. ఇన్ఫోసిస్‌, ‌టిసిఎస్‌ ‌తదితర సంస్థలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఒకే కళాశల నుంచి అమెజాన్‌కు 16 మంది ఎంపిక కావడం విశేషమన్నారు. దేశంలో మరెక్కడా ఇంత ఎక్కువ మంది ఈ సంస్థకు ఎంపిక కాలేదన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ‌బి.అరుంధతి, ప్లేస్‌మెంట్స్ ‌డీన్‌ ‌డాక్టర్‌ ‌కె.ఆర్‌ ‌సత్యనారాయణ, శిక్షణ విభాగాధిపతి డాక్టర్‌ ‌రోజీ, కంప్యూటర్‌ ‌సైన్స్ ‌విభాగాధిపతి డాక్టర్‌ ‌దినేష్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.