వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి..


Ens Balu
3
శ్రీకాకుళం
2020-12-15 22:01:55

ఆం‌ధ్రవిశ్వవిద్యాలయం ఉద్యోగులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాలని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ అకడమిక్‌ ‌స్టాఫ్‌ ‌కళాశాలలో ఏయూ ఉన్నతాధికారులు, సిబ్బందికి అందిస్తున్న వారం రోజుల నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ‌క్రిష్ణమోహన్‌ ‌మాట్లాడుతూ ఉద్యోగులు పనితీరుపై సంస్థ పనితీరు, ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. వ్యక్తి ప్రయోజనాలకంటే వ్యవస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సాంకేతికతను లాభదాయకంగా నిలుపుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు.  కేంద్రం సంచాలకులు ఆచార్య పి.విశ్వనాథం మాట్లాడుతూ వర్సిటీ డిఆర్‌, ఏఆర్‌, ‌సూపరిండెంట్‌ ‌స్థాయి బోధనేతర సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారం రోజుల శిక్షణలో భాగంగా సిబ్బందికి అవసరమైన విభిన్న నైపుణ్యాలను వృద్ధిచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్రం సహాయ సంచాలకులు ఆచార్య ఎన్‌.ఏ.‌డి పాల్‌ ‌తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల శిక్షణ కార్యక్రమంలో  40మంది వివిధ స్థాయి బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు.