ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు..


Ens Balu
2
Visakhapatnam
2020-12-15 22:12:53

డిశంబర్-25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లును రాష్ట్రంలోగల వివిధ కార్పోరేషన్, పురపాలక సంఘాల కమిషనర్లతో పట్టణ పరిపాలక శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ ఆ శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు తో కలసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గన్న కళలను సఫలీకృతం చేస్తూ, ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం గావించడానికి పలు సూచనలను మంత్రివర్యులు అందరి కమిషనర్లకు సూచించారు. కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ, వివిచ కార్పోరేషన్లో మరియు పురపాలక సంఘాలలో పట్టాల పంపిణీ, ఇండ్ల రిజిస్ట్రేషన్, బ్యాంకు రుణాలు, లబ్ది దారులకు అందించడం వంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుచున్నాయో కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు.  జివిఎంసి తరుపున కమిషనర్ డా.జి. సృజన బదులిస్తూ నగరంలో ఈ పదకం క్రింద చేపట్టబోయే 24వేలు పైబడిన టిడ్కో గృహాల మంజూరు, ఎనిమిది వేల మందికి పొసెషణ్ సర్టిఫికెట్లు, ఇంకా సుమారు 1.77లక్షల మందికి స్థల పట్టాలు మంజూరుకు తగు ఏర్పాట్లు చేపట్టామని, సంబందిత శాఖలు / బ్యాంకుల అధికారులుతో కూడా సమన్వయం చేసుకొని పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నగర పరిధిలో జయప్రదం చేయడానికి తగుచర్యలు చేపట్టామన్నారు.