రైతుకు ధీమా కలిగించే బీమా పధకం
Ens Balu
3
విజయనగరం
2020-12-15 22:14:53
వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకం క్రింద జిల్లాలో 3346 మంది రైతులకు 2.96 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో మంగళవారం రాష్ట్ర మ్యుఖ్యమంత్రి జమ చేసారు. వెలగపూడి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 1252 కోట్ల రూపాయలను 9.48 లక్షల మందికి ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 పంటలను బీమా క్రింద నోటిఫై చేయగా విజయనగరం నుండి వరి, వేరుసెనగ, చెరకు, అరటి పంటలకు బీమా వర్తింప చేసారు. రైతు ఒక్క రూపాయి చెల్లిస్తే, మిగిలిన ప్రీమియం ను ప్రభుత్వమే చెల్లించి ప్రతి అడుగులో రైతుకు తోడుగా నిలుస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. విజయనగరం నుండి పాల్గొన్న శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ , సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ తదితరులు రైతులకు బీమా పరిహారపు చెక్కును అందజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశా దేవి, డి.డి నందు, ఉద్యాన శాఖ డి డి శ్రీనివాస రావు , రైతులు పాల్గొన్నారు.