జగనన్న తోడు లక్ష్యాలను పూర్తిచేయాలి..
Ens Balu
2
జె.వెంకటాపురం
2020-12-15 22:17:08
ప్రభుత్వ పథకాల పర్యవేక్షణలో భాగంగా పలు బ్యాంకు శాఖలను జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగరం విటి అగ్రహారంలోని కెనరా బ్యాంకు శాఖను, డెంకాడ మండలం చింతవలసలోని ఎపి గ్రామీణ వికాశ్ బ్యాంకును, కెనరా బ్యాంకు శాఖను సందర్శించారు. జగనన్న తోడు దరఖాస్తుల పెండింగ్‌పై ఆరా తీశారు. అలాగే వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ఆయా బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డు ఆఫీసర్లతో చర్చించారు. ఇచ్చిన లక్ష్యాల మేరకు జగనన్న తోడు యూనిట్లకు వెంటనే రుణాన్ని మంజూరు చేసి, అవి స్థాపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో ఆయా సచివాలయాల పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.